హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాల కోసం ఆలయాల్లో నేడు వరుణ యాగం

W.G: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో మంగళవారం ఉదయం వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి వి.హరిసూర్యప్రకాశ్ తెలిపారు. భీమవరం మావుళ్లమ్మ, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, ఆచంట రామేశ్వర స్వామి, కాళ్లకూరు వేంకటేశ్వర స్వామి, దువ్వ దానేశ్వరి మాత, తాడేపల్లిగూడెం ముత్యాలమ్మ ఆలయాల్లో ఈ యాగాలు జరుగుతాయన్నారు.