హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైండోవర్ ఉల్లంఘనకు జరిమానా..!

MHBD: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు మహిళలకు తహసీల్దార్ రూ. 5 వేల జరిమానా విధించినట్లు ఎస్సై కోటేశ్వరరావు సోమవారం తెలిపారు. గంగారం మండలం తిరుమలగండి గ్రామానికి చెందిన బోడ అచ్చి, భూక్య వస్తి రెండు నెలల క్రితం గుడుంబా విక్రయిస్తూ పట్టుబడ్డారు. బైండోవర్ చేసినప్పటికీ మళ్లీ గుడుంబా తయారు చేస్తూ పట్టుబడటంతో జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.