నెల్లూరు: పొదలకూరులో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. మూడు రోజులపాటు జాతరను నిర్వహిస్తామన్నారు. ఆరవ తేదీన ఘటోత్సవం, ఏడవ తేదీన అమ్మవారి ఉత్సవం, 8వ తేదీన నిలుపు, నగరోత్సవం, నిష్క్రమణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర


