హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిల్పూర్ గుట్ట హుండీ లెక్కింపు వాయిదా..!

JN: చిల్పూర్ బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం జరగాల్సిన హుండీ లెక్కింపు వాయిదా పడింది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో దేవాలయ భూముల లీజులకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సహాయ కమిషనర్ నల్లగొండ ఆదేశాల మేరకు లెక్కింపు వాయిదా వేసినట్లు ఈవో లక్ష్మీప్రసన్న తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.