హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దకడబూరులో చెత్త వేర్పాటుపై అవగాహన

KRNL: పెద్దకడబూరులో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2025లో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి చెత్తను డబ్బాలో, పొడి చెత్తను ప్రత్యేక సంచిలో వేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటికీ తడి చెత్త కోసం గ్రామపంచాయతీ డబ్బాలను అందజేసింది. కార్యక్రమంలో ఈవోఆర్డీ జయరాముడు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.