హైదరాబాద్: 28°C
తెలంగాణ

శునకాల బెడద.. భయాందోళనలో ప్రజలు

PDPL: కమాన్‌పూర్ మండల కేంద్రంలో శునకాల బెడద తీవ్రంగా ఉంది. రహదారులు, వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాహనదారులకు అడ్డుగా వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి శునకాల బెడదను నియంత్రించాలని కోరుతున్నారు.