హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫుట్‌బాల్‌లో వివేకానంద కళాశాల విజయం

సత్యసాయి: ధర్మవరంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అంతర కళాశాలల ఫుట్‌బాల్ పోటీల్లో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల జట్టు 5-0 గోల్స్ తేడాతో విశ్వవిద్యాలయ జట్టుపై విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్‌కు చేరుకుంది. తదుపరి మ్యాచ్ మంగళవారం జరగనుంది. ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్, ఇన్‌చార్జి రమేష్ క్రీడాకారులను అభినందించారు.