BHPL: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు వచ్చిన ఆరోపణలపై కాటారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేశారు. జాదరావుపేటకు చెందిన వ్యక్తి మృతిపై ఆసుపత్రి రికార్డులు, చికిత్స వివరాలను పరిశీలించారు. నిబంధనలు పాటించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దన్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.
తెలంగాణ
ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యాధికారుల తనిఖీ


