HNK: శాయంపేట మండల కేంద్రంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. సోమవారం భూపాలపల్లికి చెందిన రాంచందర్, దేవేంద్ర, సరోజన,శ్యామలు పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై నిరసనకు దిగడంతో వాహనదారులకు ఇబ్బందులు కలిగాయని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా రోడ్లపై నిరసనలు చేపడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
తెలంగాణ
పోలీసుల విధులకు ఆటంకం..!


