హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల బస్సు ఢీకొని కూలీ మృతి

GNTR: చినలింగాయపాలెం సమీపంలో పాఠశాల బస్సు ఢీకొని నన్నేపాగ సురేష్‌(45) మృతిచెందారు. సోమవారం వ్యవసాయ పనుల కోసం పాండ్రపాడు వెళ్లిన సురేష్‌ పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాకుమానుకు చెందిన ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీకొట్టడంతో ఆయన మృతి చెందినట్లు ఎస్‌ఐ బి.హరికృష్ణ తెలిపారు. భార్య శారద ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.