హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెగా జాబ్‌మేళాకు భారీ స్పందన..!

HNK: హంటర్‌రోడ్డులోని న్యూసైన్స్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో 46 కంపెనీలతో సోమవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు 2,900 మంది విద్యార్థులు హాజరయ్యారు. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ తదితర సంస్థలు పాల్గొని 766 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు జయరాం తెలిపారు.