హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: సబ్బవరం మండలంలో మంగళవారం పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ మురళీకృష్ణ తెలిపారు. అదనపు బ్రేకర్ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెదనాయుడుపాలెం, తవ్వవానిపాలెం, అమృతపురం, సూరెడ్డిపాలెం, అమరపినివానిపాలెం, పెదగొల్లలపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.