హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

ELR: దెందులూరు హైవేపై పున్నమి హోటల్ సమీపంలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్న 5,000 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం విలువ రూ.2 లక్షలు, వాహనం విలువ రూ.8 లక్షలుగా అధికారులు తెలిపారు. అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.