హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో మంత్రి డ్రైవర్ మృతి

PLD: చిలకలూరిపేట పరిధిలోని పోలిరెడ్డిపాలెం బైపాస్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు, బైక్ ఢీకొన్న ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డ్రైవర్‌గా స్థానికులు గుర్తించారు. టిడ్కో గృహాల బైపాస్ బ్రిడ్జి వద్ద ప్రమాదం జరగ్గా, పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.