VZM: వంగర SI షేక్ శంకర్ నిన్న సాయంత్రం స్దానిక రుషింగి వంతెన వద్ద డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్.. వ్యక్తిపై కేసు నమోదు


