హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

బాపట్ల మండలం ముత్తాయపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు గురజాల శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యాయులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గురువులే మార్గదర్శకులని హెచ్‌ఎం పేర్కొన్నారు.