హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: రాయపర్తి మండలంలోని పెర్కవేడు ఉప విద్యుత్ కేంద్రం పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని AE శ్రీధర్ తెలిపారు. కేంద్రంలో అదనపు నియంత్రికల ఏర్పాటు పనులు చేపడుతుండటంతో పెర్కవేడు, ఏకే తండా, సూర్య తండా గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని, ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు.