హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడేగాంలో పంట నమోదు 100 శాతం పూర్తి

KMR: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ ఆన్‌లైన్‌ లొకేషన్‌ డిజిటల్‌ సర్వేలో మూడేగాం గ్రామంలో పంట నమోదు 100 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా వ్యవసాయ వాలంటీర్‌ నర్సింహులును సర్పంచ్‌ గౌడెల్లి గంగాధర్‌ అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ఏఈఓ సురేందర్‌, ఉపసర్పంచ్‌, కార్యదర్శి గణేష్‌, వార్డు సభ్యులు, రాజయ్య కౌశిక్‌, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.