హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అన్నమయ్య: రాజంపేట మండలం బోయినపల్లి ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా మంగళవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. కొత్త బోయినపల్లి, ఎల్లాగడ్డ, బైపాస్, స్కంద హాస్పిటల్ మెయిన్ రోడ్, బలిజ వీధి, సాత వీధి, అంగళ్లమిట్ట, మునక్కాయలపల్లె, గొల్లపల్లి తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.