PLD: నరసరావుపేటకోట సెంటర్‌లోని ఓ మెడికల్ షాపులో గడువు తీరిన ఔషధాలతో పాటు బిల్లులు లేకుండా మందులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో సోమవారం ఈగల్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈగల్ ఎస్‌ఐ రాజీవ్‌కుమార్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పర్వీన్ సుల్తానా సిబ్బందితో కలిసి దుకాణాన్ని తనిఖీ చేశారు. ఔషధాల నిల్వలు, విక్రయ బిల్లులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
బిల్లు లేకుండా మందుల విక్రయాలపై తనిఖీలు


