హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం పాదగయ క్షేత్రానికి వచ్చే భక్తులకు సూచన

కాకినాడ: పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాలయ పక్షాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పిండప్రదానం, తర్పణం తదితర పితృకార్యాలు నిర్వహిస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా సహస్ర ఘట్టాభిషేకాన్ని ఉదయమే నిర్వహిస్తున్నట్లు ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. అభిషేకం సమయంలో ఆర్జిత సేవలను నిలిపివేసి, అనంతరం యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.