హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్ష!

పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్‌-2026లో కలెక్టర్‌ కృతిక శుక్ల, జేసీ సంజనా శ్రీహర్ష పాల్గొని రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. రీ సర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల వెరిఫికేషన్‌, 22-ఏ భూములు, హౌస్‌సైట్‌ పట్టాలు, పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు, హైకోర్టు కేసులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.