హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 గంటల్లోనే హత్య కేసును చేధించిన పోలీసులు

ATP: అనంతపురం కోవూరునగర్‌లో వృద్ధురాలు మీసాల సన్నాగులు హత్య కేసును నజరంలోని ఫోర్త్ టౌన్ పోలీసులు 5 గంటల్లోనే ఛేదించారు. సొంత బామ్మ వరుసైన మహిళను రోకలి కట్టెతో బాది, కమ్మల కోసం హత్య చేసిన మనవడు లక్ష్మినారాయణను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద కమ్మలు, కట్టర్ బ్లేడు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కరుణాకర్ రావు తెలిపారు.