హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: త్రిశూల్ వ్యూహంతో 3 సమస్యల కట్టడి: DCP

NTR: ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో ఎస్‌ఐ గంధం మహాలక్ష్ముడు ఆధ్వర్యంలో సోమవారం త్రిశూల్‌ వ్యూహం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీపీ బి.లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆపరేషన్‌ త్రిశూల్‌ చేపట్టినట్లు తెలిపారు.