KDP: వీ.ఎన్ పల్లె(M) పాలగిరి రైతు సేవా కేంద్రం పరిధిలో రబీ సీజన్‌లో సాగు చేసుకునేందుకు రైతులకు బుడ్డ శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు VHA స్వప్న తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నగదుతో రైతు సేవా కేంద్రానికి రావాలని సూచించారు. పంట సాగు చేసే రైతులు మాత్రమే శనగ విత్తనాలు తీసుకోవాలని, పంపిణీకి రైతులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రబీ సాగుకు శనగ విత్తనాల పంపిణీ


