హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేమవరం కొండలమ్మ హుండీ ఆదాయం ఎంతంటే..!

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థాన హుండీలను సోమవారం లెక్కించారు. 64 రోజుల హుండీ ఆదాయం కింద నోట్ల రూపంలో రూ.25,16,520, చిల్లర రూపంలో రూ.2,65,747 కలిపి మొత్తం రూ.27,82,267 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. అన్నదానం హుండీ ద్వారా రూ.59,660, చిల్లర రూపంలో రూ.4,620 వచ్చాయన్నారు.