హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హెల్త్ వర్కర్లకు బకాయి వేతనాలు చెల్లించాలి'

అల్లూరి జిల్లాలో పనిచేస్తున్న 725మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 4నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య పడాల్, కార్యదర్శి ఉమామహేశ్వరరావు సోమవారం పాడేరులో డిమాండ్ చేశారు. నెలకు రూ.4వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, అది కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.