కృష్ణా: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని జేసీ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ మీటింగ్ హాలులో జిల్లాలోని బ్యాంకర్లు, రైస్ మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ సమయంలో ఎదురవుతున్న పలు సమస్యలపై సమావేశంలో చర్చించారు. బ్యాంక్ గ్యారంటీల సమర్పణలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఖరీఫ్ ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు: జేసీ


