ప్రకాశం: దర్శి సర్కిల్ నూతన సీఐగా నరహరి నాగ మల్లేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడంతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
దర్శి సర్కిల్ సీఐగా నరహరి నాగ మల్లేశ్వరరావు


