హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాతుపల్లిలో స్థానిక ఎన్నికలపై సీఐ అవగాహన సమావేశం

అన్నమయ్య: సాతుపల్లి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మన్నూరు సీఐ లింగప్ప ఆధ్వర్యంలో గ్రామస్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.