VSP: సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ హవల్దార్ సరగడ సూర్యకిరణ్ రెడ్డి (39) ఆకస్మిక మృతితో భీమిలి మండలం చిప్పాడలో విషాదం నెలకొంది. అసోంలోని దిబ్రూగఢ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన వినాయక చవితికి ఇంటికి వచ్చారు. తీవ్ర అస్వస్థతతో ఆరిలోవలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
జవాన్ ఆకస్మిక మృతి!


