హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యం పట్టివేత

ప్రకాశం: పెద్దారవీడు మండలంలోని మద్దలకట్ట గ్రామ పరిధిలో పొలాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గోతం సంచిలో మద్యం బాటిళ్లు పెట్టుకుని విక్రయిస్తున్న అతని వద్ద నుంచి 52 క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.