హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలసపాడు మండలంలో రోడ్డు ప్రమాదం

KDP: కలసపాడు మండలం పిడుగుపల్లి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు యువతులను స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.