RR: ఎల్బీనగర్ ACP కృష్ణయ్య సస్పెండ్ అయ్యారు. ఆయనపై పలు అవినీతి సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం సస్పెన్షన్ వేటు తప్పదనే ప్రచారం జరిగిన సమయంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. డిశ్చార్జ్ అనంతరం విధుల్లో చేరిన వెంటనే ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
ఎల్బీనగర్ ఏసీపీపై సస్పెన్షన్ వేటు


