హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి'

SKLM: వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో ఉచిత ఇసుక పేరుతో అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట మండలాల నుంచి ఇసుకను ఒడిశాకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.