BHPL: చిట్యాల మండలం కైలాపూర్ శివారులో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం ప్రారంభించారు. ప్లాంట్ పనితీరును పరిశీలించిన ఆయన, సౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడాలి ఓదెలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొబ్బెట అనిల్ పాల్గొన్నారు.
తెలంగాణ
సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


