కృష్ణా: అంతరాష్ట్ర దొంగల ముఠాను పెనమలూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తాడిగడపలో ఈ నెల 3న రూ.5 లక్షల విలువైన 77 కాయిళ్ల రాగి కేబుళ్లు చోరీకి గురయ్యాయి. కేసును వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు వనకూరు శివారులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెనమలూరులో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్


