హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి'

VSP: ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి అని ఏయూ విద్య విభాగాధిపతి ఆచార్య టి. షారోన్‌ రాజు అన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాంకేతికతలు అభివృద్ధి చెందినా గురువు స్థానానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. ఉపాధ్యాయులు జ్ఞానంతో పాటు విలువలను అందిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.