హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం

SRD: సిర్గాపూర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికురాలు మేత్రి మల్కమ్మ ఆకస్మిక మృతితో ఆమె కుటుంబాన్ని స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు పరామర్శించారు. సోమవారం వారి నివాసానికి వెళ్లి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, పంచాయతీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.