హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో వ్యవసాయ మంత్రి పర్యటన

BPT: బాపట్లలో సోమవారం పంట కోత అనంతర సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట కోత అనంతర సాంకేతికతతో రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్రవర్మ పాల్గొన్నారు.