హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాలి'

ASR: గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడలో మండల వ్యవసాయ అధికారి సురేష్ సోమవారం వరి పంటలను పరిశీలించారు. బూటింగ్ దశలో ఉన్న పంటలను పరిశీలించి పురుగు, తెగుళ్లు, ఎరువుల యాజమాన్యంపై రైతులకు సూచనలు చేశారు. పాముపొడ తెగులు కనిపిస్తే హెక్సాకోనజోల్ ఎకరానికి 400 మి.లీ.ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. దోమ ఉధృతి ఉంటే డైనోటెఫ్యూరాన్‌ను వాడాలని సూచించారు.