హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా హత్య కేసులో భర్త అరెస్ట్

NRPT: మక్తల్ పీఎస్ పరిధిలో గుడిగండ్ల-జక్లేర్ మధ్య జాతీయ రహదారి పక్కన అక్టోబర్ 1న జరిగిన మహిళా యశోద హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం సీఐ రామ్‌లాల్, ఎస్సై రాజు వివరాలు వెల్లడించారు. యశోద భర్త లక్ష్మణ్ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించామని తెలిపారు. శిశు విక్రయానికి సంబంధించిన డబ్బుల విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమని పేర్కొన్నారు.