హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాడీబిల్డింగ్‌లో ప్రభాకర్ సత్తా

GDWL: బెంగళూరులోని బీఆర్‌ఎస్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన వాలార్ క్లాసిక్-2026 బాడీబిల్డింగ్ పోటీల్లో అయిజకు చెందిన ఆర్‌ఎస్ జిమ్ ట్రైనర్ ప్రభాకర్ సత్తా చాటారు. మెన్స్ ఫిజిక్ విభాగంలో టైటిల్ విన్నర్‌గా నిలిచారు. వివిధ రాష్ట్రాల నుంచి బాడీబిల్డర్లు పాల్గొన్న పోటీల్లో విజేతగా నిలిచిన ప్రభాకర్‌కు నిర్వాహకులు ట్రోఫీ అందజేశారు.