హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇందుపల్లిలో రైతులకు పాస్‌బుక్కులు అందజేత

NTR: ఇందుపల్లి గ్రామంలో గ్రామ సభ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా రైతులకు రెవెన్యూ పాస్‌బుక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వర్లమూడి రాంబాబు, పార్టీ నాయకులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.