హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాఠశాలలో 8 నూతన తరగతి గదులు ప్రారంభం

E.G: జగ్గంపేట మండలం రాజపూడి జెడ్పీ పాఠశాలలో నూతనంగా నిర్మించిన 8 అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారితో ముచ్చటించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాజపూడిలో బాలురకు ఇంటర్మీడియట్ విద్య ప్రారంభించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.