SRPT: మునగాల మండలం తిమ్యారెడ్డిగూడ గ్రామంలో బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈశ్వరమ్మ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి 12 గంటల వరకు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం రోడ్డు పక్కన బావిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తెలంగాణ
బావిలో మహిళ మృతదేహం


