హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంగ్టిలో ఉచిత టీబీ పరీక్షలు: డా. నాగమణి

SRD: కంగ్టి పీహెచ్‌సీ పరిధిలో ఉచిత టీబీ ఎక్స్‌రే వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయని మెడికల్ ఆఫీసర్ డా. నాగమణి తెలిపారు. గ్రామీణ ప్రజల్లో టీబీపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఎక్స్‌రే పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి, పాజిటివ్‌గా నిర్ధారణైన వారికి వెంటనే ఉచిత చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల 10 మంది బాధితులకు న్యూట్రిషన్ కిట్లు అందించినట్లు తెలిపారు.