హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాళీలను భర్తీ చేయాలని వినతిపత్రం మాజీ MPTC

కోనసీమ: కేశవరం పరిధిలోని 3 సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను నియమించాలని మాజీ MPTC తుపాకుల ప్రసన్నకుమార్ సోమవారం పంచాయతీ గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశారు. సిబ్బంది లేకపోవడంతో వివిధ ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఆయా సచివాలయాలకు డిజిటల్ అసిస్టెంట్లను నియమించాలని కోరారు.