హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీఆర్‌ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్

కోనసీమ: వీఆర్‌ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని పి.గన్నవరం మండల వీఆర్‌ఏల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకృష్ణ శ్రీనివాసరావు కోరారు. పి.గన్నవరం మండల కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేపట్టిన నిరసన కార్యక్రమం సోమవారానికి 20వ రోజుకు చేరుకుంది. వీఆర్‌ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.