హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ 8 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.